logo

4 గంటల్లోనే దొంగను పట్టేశారు

ట్టపగలే ఇంట్లోకి చొరబడిన దొంగ అందినంత దోచుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు కేవలం 4గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఎల్బీనగర్‌ రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం క్రైమ్‌ డీసీపీ యాదగిరి, అదనపు డీసీపీ శ్రీనివాసులు, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డిలతో కలిసి

Published : 28 Jan 2022 02:37 IST

నిందితుడు శుభాకర్‌

నాగోలు, న్యూస్‌టుడే: పట్టపగలే ఇంట్లోకి చొరబడిన దొంగ అందినంత దోచుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు కేవలం 4గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఎల్బీనగర్‌ రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం క్రైమ్‌ డీసీపీ యాదగిరి, అదనపు డీసీపీ శ్రీనివాసులు, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డిలతో కలిసి ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. కొడిదెల శుభాకర్‌ అలియాస్‌ సుధాకర్‌(27) స్వస్థలం నాగర్‌కర్నూల్‌ జిల్లా గుడిపల్లి. మీర్‌పేట్‌ పాతగ్రామంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వృత్తి భవన నిర్మాణ మేస్త్రీ. ప్రవృత్తి చోరీలు చేయడం. తల్లి హత్య కేసు, చోరీలపై నాగర్‌కర్నూలు, ఎల్‌బీనగర్‌, మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్లలో 11కుపైగా కేసులున్నాయి. మధ్యాహ్నం కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తాడు. అనువుగా ఉన్న ఇంటి తలుపు తాళాలు బద్దలు కొట్టి దోచేస్తాడు. ఓకేసులో జైలుకెళ్లి ఈనెల7న విడుదలై మళ్లీ చోరీలు ప్రారంభించాడు.

సాంకేతికతతో... ఈనెల26న మధ్యాహ్నం బడంగ్‌పేట శివనారాయణ పురంలోని విశ్రాంతఉద్యోగి రత్నాకర్‌రావు ఇంటితాళాన్ని పగులగొట్టిన శుభాకర్‌ 26తులాల బంగారం, 25గ్రాముల వెండి, ల్యాప్‌ట్యాప్‌, నగదు చోరీచేశాడు. బంధువువద్దకు వెళ్లి తిరిగొచ్చిన బాధితుడు రత్నాకర్‌ మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీసీఎస్‌, ఐటీసెల్‌ విభాగంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీఫుటేజ్‌ ఆధారంగా నేరుగా మీర్‌పేట్‌లో దొంగ ఇంటివద్దకు చేరారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా అతడున్న ప్రాంతాన్ని గుర్తించారు. అప్పటికే అతడు చోరీ నగదుతో సెల్‌ఫోన్‌, దుస్తులు కొన్నాడు. బంగారపు ఉంగరం అమ్మేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే పోలీసులు నిందితుడిని అరెస్ట్‌చేసి రూ.13.10లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 4 గంటల్లోనే కేసు ఛేదించిన మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, డీఐ సీహెచ్‌.శేఖర్‌, డీఎస్సై నర్సింగ్‌రాథోడ్‌, మారయ్య, ఇతర సిబ్బందిని డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ అభినందించి రివార్డులు అందించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని