logo

నిర్విరామంగా రిజిస్ట్రేషన్లు

స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో నగరంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్థిరాస్తి విలువలు పెరుగుతున్న నేపథ్యంలో ఈలోపే పూర్తిచేయాలని చాలామంది త్వరపడుతున్నారు. పలు కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చిన వారు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు

Published : 28 Jan 2022 02:37 IST

రాత్రి 7 గంటల వరకూ కొనసాగింపు

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో నగరంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కళకళలాడుతున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి స్థిరాస్తి విలువలు పెరుగుతున్న నేపథ్యంలో ఈలోపే పూర్తిచేయాలని చాలామంది త్వరపడుతున్నారు. పలు కారణాలతో వాయిదా వేసుకుంటూ వచ్చిన వారు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఉదయం 10.30 గంటలకే కార్యాలయాలు కిక్కిరిసిపోతున్నాయి. సాధారణ రోజుల్లో 20 అయ్యే రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం 45-50 చొప్పున అవుతున్నట్లు సబ్‌ రిజిస్ట్రార్‌లు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో ఇది సాధారణమే అయినా రంగారెడ్డి జిల్లాతో పాటు.. మేడ్చల్‌ జిల్లాలోనూ గణనీయంగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు. రాత్రి 7-8 గంటల వరకూ కార్యాలయాలు రద్దీగా కనిపించాయి. రంగారెడ్డి జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సాధారణంగా రోజుకి 75-100 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యేవి.. ప్రస్తుతం ఆ సంఖ్య 200 దాటుతున్నట్లు సబ్‌రిజిస్ట్రార్‌ సుబ్బారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని