logo

కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి

కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు కూడా కేటాయించరా అన్ని ప్రశ్నించారు. గురువారం కాచిగూడలో

Published : 28 Jan 2022 04:19 IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

నినాదాలు చేస్తున్న వెంకటేశ్‌, రాజేందర్‌, జనార్దన్‌, ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జయంతి, అంజి, మల్లేశ్‌

అంబర్‌పేట, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కనీసం 5 శాతం నిధులు కూడా కేటాయించరా అన్ని ప్రశ్నించారు. గురువారం కాచిగూడలో ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద బీసీ విద్యార్థులు చదువుకోవడానికి కనీసం ఉపకారవేతనం ఇవ్వాలనే ఆలోచన కేంద్రానికి లేకపోవడం దుర్మార్గమని తెలిపారు. బీసీ కుల వృత్తులు, కుటీర, చిన్న పరిశ్రమల కోసం నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. నేతలు కోలా జనార్దన్‌, నీలా వెంకటేశ్‌, మల్లేశ్‌యాదవ్‌, రాజేందర్‌, అంజి, జయంతి, బబ్లూగౌడ్‌, శివకుమార్‌, చంటి ముదిరాజ్‌ పాల్గొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని