logo

చిత్ర వార్తలు

నగరంలో స్కైవాక్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది. హెచ్‌ఎండీఏ ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో రూ.36.50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆకాశ మార్గం పనులు  వేగవంతం చేశారు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు అమరుస్తున్నారు.   రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది.

Published : 28 Jan 2022 04:19 IST

ఇక ఆగేదేలే!

నగరంలో స్కైవాక్‌ల నిర్మాణం జోరుగా సాగుతోంది. హెచ్‌ఎండీఏ ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో రూ.36.50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆకాశ మార్గం పనులు  వేగవంతం చేశారు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు అమరుస్తున్నారు. రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది.


అక్కరకొచ్చేదెప్పుడు.. అవస్థలు తీరేదెప్పుడు?

నగరంలో పార్కింగ్‌ అతిపెద్ద సమస్య. పరిష్కరించడంలో భాగంగా తొలిసారి నాంపల్లిలోని గాంధీభవన్‌ పక్కన బహళంతస్తుల్లో వాహనాల నిలుపు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఏడాదిలో పూర్తిచేయాలన్న లక్ష్యంతో చేపట్టగా మూడేళ్లయినా అక్కరకు రాకపోవడం గమనార్హం.


నిర్వహణ అధ్వానం.. కుక్కలకు ఆవాసం

జూబ్లీ బస్‌స్టేషన్‌ బయట ఆర్టీసీ సిటీ బస్సులను ఇష్టానుసారం నిలిపేస్తున్నారు. కొన్ని బస్సులను రోజుల తరబడి పట్టించుకోకపోవడం వల్ల దుమ్ము కొట్టుకుపోతున్నాయి. జన సంచారం లేకపోవడంతో కుక్కలకు ఆవాసాలుగా మారాయి.  


అటు పెంచుడు.. ఇటు తుంచుడు

బహదూర్‌పుర నుంచి ఆరాంఘర్‌ వెళ్లే రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్నాయని 50కి పైగా భారీ చెట్లను నరికేస్తున్నారు. హరితహారం కింద ఓవైపు రూ.కోట్లు వెచ్చించి మొక్కలు పెంచుతూ మరోవైపు భారీ వృక్షాలను నరకడం విమర్శలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని