Hyderabad: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెట్రోలు సీసాతో విద్యార్థి ఆందోళన.. ఉద్రిక్తత!
హైదరాబాద్: ఫ్లెక్సీల రగడతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్వల్ప ఉద్రికత చోటుచేసుకుంది. తెరాస నాయకుల ఫ్లెక్సీలను కొందరు విద్యార్థి నేతలు చించివేశారు. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకొని ఓయూలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని టీఆర్ఎస్వీ నిర్ణయించింది. టోర్నమెంట్ ప్రారంభించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు సమాయత్తమైన కొందరు విద్యార్థి నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేశారు. మరికొందరు ఫ్లెక్సీలు చింపేయగా.. పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంత్రులు అడుగుపెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సురేశ్.. పెట్రోల్ సీసాతో ఆందోళనకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి
Advertisement