logo

Suicide: ‘దొంగ’ ముద్ర వేశారని ఉద్యోగి ఆత్మహత్య

తనకు సంబంధం లేని వ్యవహారంలో ‘దొంగ’ ముద్ర వేశారంటూ లేఖ రాసి ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం..

Updated : 29 Jan 2022 06:53 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తనకు సంబంధం లేని వ్యవహారంలో ‘దొంగ’ ముద్ర వేశారంటూ లేఖ రాసి ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్‌లో నివసించే బొల్లం శివరాం(30) 3 నెలల క్రితం మణికొండలోని జియో మార్ట్‌ స్టోర్‌లో చేరారు. వారం రోజులుగా స్థిమితంగా లేకపోవడంతో భార్య మీనాక్షి ప్రశ్నించగా.. పని ఒత్తిడితో అలా ఉన్నట్లు తెలిపాడు. గురువారం ఉదయం విధులకు వెళ్లాడు. భార్య ఓ వేడుక కోసం మేడ్చల్‌ వెళ్లింది. శివరాం మధ్యాహ్నం ఇంటికి వచ్ఛి. గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. సాయంత్రం 5.30 ప్రాంతంలో తండ్రి జంగయ్య కుమారుడిని పిలిచేందుకు వెళ్లగా తలుపు తీయలేదు. తలుపులు పగులగొట్టి చూస్తే ఉరేసుకొని కనిపించాడు. ఆసుపత్రికి తీసుకువెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. గదిలోని పుస్తకంలో ‘సంతోష్‌ సార్‌.. హబ్‌లో కనిపించని రూ.2 లక్షల విషయంలో దొంగ ముద్ర వేశారు, నేను భరించలేను.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను.. ఐయామ్‌ సారీ సర్‌, యువర్స్‌ సిన్సియర్లీ బి.శివరాం అంటూ ఒక పేజీలో, భార్యకు ఈసారి పోయిన డబ్బులో తాను రూపాయి కూడా తినలేదని.. తనను తప్పు పట్టవద్దని, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తనను క్షమించాలని.. మరోపేజీలో.. కన్నయ్య జాగ్రత్త.. నన్ను క్షమించు’ అంటూ రాసిన మరో లేఖలను పోలీసులు గుర్తించారు. సంతోష్‌పై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని