logo

వ్యసనాలకు బానిసై.. చోరీల బాట

రెండు రోజుల్లో ఎనిమిది చరవాణులు చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో శుక్రవారం డీసీపీ జోయల్‌ డేవిస్‌, అదనపు.....

Published : 29 Jan 2022 03:06 IST

రెండు గంటల్లో నలుగురు నిందితుల అరెస్టు


మాట్లాడుతున్న డీసీపీ జోయల్‌ డేవిస్‌, అదనపు డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, ఏసీపీ సుదర్శన్‌, సీఐ శివచంద్ర

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రెండు రోజుల్లో ఎనిమిది చరవాణులు చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో శుక్రవారం డీసీపీ జోయల్‌ డేవిస్‌, అదనపు డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌ వెల్లడించారు. ఈనెల మొదటి వారంలో, 24న రాత్రి, 25న ద్విచక్రవాహనంపై కొందరు వ్యక్తులు సంచరిస్తూ రోడ్డుపై వెళ్లేవారిని బెదిరించి చరవాణులు లాకెళ్లారు. సాంచూరి బార్‌ అండ్‌ కిచెన్‌ సమీపంలో బాధితుడు గట్టిగా ప్రతిఘటించడంతో పరారయ్యారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు తెలుపు రంగు ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు గుర్తించారు. దాని ఆధారంగా 25వ తేదీ అర్ధరాత్రి నిందితులను గుర్తించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.10లోని సింగాడిబస్తీకి చెందిన పెయింటర్‌ మహ్మద్‌ ఖాజా పాషా(19), విద్యార్థి మహ్మద్‌ సబీల్‌(19), పెయింటర్‌ షేక్‌ సొహైల్‌(19), పవన్‌కుమార్‌(20)ను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరం అంగీకరించడంతో నలుగురిని రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంతో కీలకంగా వ్యవహరించిన డీఎస్సై కె.వెంకటేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శేఖర్‌, కానిస్టేబుళ్లు అహ్మద్‌ మొయినుద్దీన్‌, రాము, శివశంకర్‌, హోంగార్డు కిషన్‌లకు డీసీపీ రివార్డు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని