logo

హైదరాబాద్‌ సాహితీ సంబరం ప్రారంభం

సాంస్కృతిక.. సాహిత్య వికాసాన్ని ఇనుమడింపజేస్తూ నాటి, నేటి సాహితీవేత్తలకు వేదికగా నిలిచే 12వ హైదరాబాద్‌ సాహితీ సంబరం(హెచ్‌ఎల్‌ఎఫ్‌) ప్రారంభమైంది.

Published : 29 Jan 2022 03:06 IST

పఠన నైపుణ్యాల వృద్ధికి విద్యాసంస్థల్లో పుస్తక క్లబ్‌లు

ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌


మాట్లాడుతున్న జయేశ్‌రంజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: సాంస్కృతిక.. సాహిత్య వికాసాన్ని ఇనుమడింపజేస్తూ నాటి, నేటి సాహితీవేత్తలకు వేదికగా నిలిచే 12వ హైదరాబాద్‌ సాహితీ సంబరం(హెచ్‌ఎల్‌ఎఫ్‌) ప్రారంభమైంది. వర్చువల్‌గా జరిగే ఉత్సవాన్ని శుక్రవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ప్రారంభించారు. ఇది మూడు రోజులపాటు జరగనుంది. ఈసారి భాగస్వామ్య దేశంగా బ్రిటన్‌ వ్యవహరించనుండగా భాషాపరంగా పంజాబీని ఎంపిక చేశారు. ప్రారంభ కార్యక్రమంలో జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో తక్కువ సమయంలోనే ఉత్సవం మంచి పేరు సంపాదించిందన్నారు. యూకేతో ముందునుంచీ భారత్‌కు మంచి సత్సంబంధాలున్నాయని, ప్రముఖ రచయితలెందరో వచ్చి హైదరాబాద్‌ను సందర్శిస్తున్నారన్నారు. పంజాబ్‌తో తెలంగాణకు ఎంతో అనుబంధం ఉందన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పుస్తకాల క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఆర్ట్స్‌ ఇండియా సంచాలకుడు జోనాథన్‌ కెన్నడీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ఉన్న సాంస్కృతిక, కళా వారసత్వం ఘనమైనదని కొనియాడారు. హెచ్‌ఎల్‌ఎఫ్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అజయ్‌గాంధీకి నిర్వాహకులు నివాళులర్పించారు.ప్రదర్శన విభాగాన్ని ప్రముఖ రచయిత సి.రామ్‌మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. హెచ్‌ఎల్‌ఎఫ్‌ సంచాలకులు టి.విజయ్‌కుమార్‌, కిన్నెరమూర్తి, అమితాదేశాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని