logo

కశ్మీర్‌లో ఉపాధి కరవై.. పాతబస్తీ ఆదరవై!

చలి కాలంలో సైబీరియన్‌ పక్షులు దక్షిణ భారత దేశానికి వలస వస్తుంటాయి. అదే విధంగా వణికిస్తున్న మంచు వల్ల కశ్మీర్‌లో ఉపాధి కరవై కార్మికులు, రైతులు హైదరాబాద్‌కు వలసగా వచ్చారు.

Published : 29 Jan 2022 03:06 IST


ఖిల్వత్‌ పాదబాటపై నిద్రకు ఉపక్రమించిన కశ్మీరీలు

చార్మినార్‌, న్యూస్‌టుడే: చలి కాలంలో సైబీరియన్‌ పక్షులు దక్షిణ భారత దేశానికి వలస వస్తుంటాయి. అదే విధంగా వణికిస్తున్న మంచు వల్ల కశ్మీర్‌లో ఉపాధి కరవై కార్మికులు, రైతులు హైదరాబాద్‌కు వలసగా వచ్చారు. సుమారు 200 మంది కశ్మీర్‌, పూంచ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు వారం రోజులుగా చార్మినార్‌, మక్కా మసీదు సమీప ఖిల్వత్‌ మార్గంలోని పాదబాటపై ఉంటున్నారు. రాత్రి దుకాణాలు మూసేయగానే ఇక్కడి పాదబాటలపై కునుకు తీస్తున్నారు. పగలు భిక్షాటన, కూలి పనులు చేసుకుంటున్నారు.

* ఆదరిస్తున్న హైదరాబాదీలు: హైదరాబాదీలు తమను ఎంతో ఆదరిస్తున్నారని, ఆహారం, దుస్తులు అందజేస్తున్నారని పూంచ్‌ ప్రాంతానికి చెందిన బద్రుద్దీన్‌, జియావుద్దీన్‌, మాజిద్‌ తెలిపారు. వ్యవసాయ పనులకు వీలులేకుండా కశ్మీర్‌లో మంచు కురుస్తుండటంతో ఇక్కడికి వచ్చామని, చలి సీజన్‌ ముగియగానే వెళతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని