logo

హైదరాబాద్‌లో ఐపీవోవై 22 పురస్కార ప్రదానోత్సవం

తొలి ‘ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ (ఐపీవోవై 22) పురస్కార ప్రదానోత్సవానికి నగరం వేదిక కానుందని హెచ్‌ఎండీఏ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఎండీ బీఎం సంతోష్‌ తెలిపారు.

Published : 29 Jan 2022 03:06 IST


లోగోను ఆవిష్కరిస్తున్న హెచ్‌ఎండీఏ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఎండీ సంతోష్‌, ఐపీఎఫ్‌ వ్యవస్థాపకుడు
అక్విన్‌, క్రెడాయ్‌ నగర అధ్యక్షుడు రామకృష్ణారావు, రాజశేఖర్‌రెడ్డి, ఆదిత్య గౌర

రాయదుర్గం, న్యూస్‌టుడే: తొలి ‘ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ (ఐపీవోవై 22) పురస్కార ప్రదానోత్సవానికి నగరం వేదిక కానుందని హెచ్‌ఎండీఏ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ ఎండీ బీఎం సంతోష్‌ తెలిపారు. ఇండియన్‌ ఫొటో ఫెస్టివల్‌(ఐపీఎఫ్‌), హెచ్‌ఎండీఏ, క్రెడాయ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నానక్‌రాంగూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో శుక్రవారం వివరాలను వెల్లడించారు. ఈ వేడుక ద్వారా నగరానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. దీనిలో భాగంగా ఫొటోగ్రఫీ పోటీఉంటుదన్నారు. ఐపీఎఫ్‌ వ్యవస్థాపకుడు అక్విన్‌ మ్యాథూస్‌ మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి జూన్‌ 21 వరకు ప్రపంచవ్యాప్తంగా ఫొటోగ్రాఫర్‌ల నుంచి ఎంట్రీలు స్వీకరిస్తామన్నారు. ఆగస్టు 15న విజేతలను ప్రకటిస్తామన్నారు. సెప్టెంబరు 10న నగరంలో నిర్వహించే వేడుకలో పురస్కారాలు ప్రదానం చేస్తామన్నారు. క్రెడాయ్‌ నగర అధ్యక్షుడు పి.రామకృష్ణారావు మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పర్యాటకులకు ఆకర్షించేందుకు ప్రదర్శనతో అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అవార్డులోగోను ఆవిష్కరించారు. క్రెడాయ్‌ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, ఆదిత్యగౌర పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని