logo

వీర్లపల్లిలో అడవి పంది బీభత్సం

వేటగాళ్ల వలల నుంచి తప్పించుకున్న ఓ అడవి పంది గ్రామంలోకి బీభత్సం సృష్టించిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 29 Jan 2022 03:06 IST

ఇద్దరికి గాయాలు

నందిగామ, న్యూస్‌టుడే: వేటగాళ్ల వలల నుంచి తప్పించుకున్న ఓ అడవి పంది గ్రామంలోకి బీభత్సం సృష్టించిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామ శివారులో గుర్తుతెలియని వేటగాళ్లు వలలు వేయగా తప్పించుకుని గ్రామంలోకి చొరబడింది. ఇంటి బయట ఆడుకుంటున్న దుబ్బ రమేష్‌ ఐదేళ్ల కుమార్తెను కరవడంతో చేయి మూడుచోట్ల విరిగింది. అనంతరం రంగం రవి ఇంట్లోకి వెళ్లి అతన్ని గాయపరిచింది. వెంటనే గ్రామానికి వచ్చిన వేటగాళ్లు వలవేసి అడవిపందిని బంధించేందుకు ప్రయత్నించగా.. వీరంగం సృష్టించింది. దీంతో గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి అంతమొందించారు. గ్రామస్థులు గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని