logo

ఓటు హక్కు ప్రాధాన్యంపై గీతం

ఓటు హక్కు ప్రాధాన్యం వివరిస్తూ రచించిన ‘ఓట్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ గీతాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో ఆవిష్కరించారు.

Published : 29 Jan 2022 03:32 IST


కార్యక్రమంలో జోషి, అజయ్‌మిశ్రా, వెంకటేష్‌ దేశ్‌ముఖ్‌, సుద్దాల అశోక్‌తేజ, యశోకృష్ణ, జి.వి.రావు తదితరులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఓటు హక్కు ప్రాధాన్యం వివరిస్తూ రచించిన ‘ఓట్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ గీతాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో ఆవిష్కరించారు. వ్యాపారవేత్త జి.వి.రావు రాసిన ఈ గీతాన్ని హిందీలో బాలివుడ్‌ గాయకుడు కైలాష్‌ ఖేర్‌ ఆలపించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు ఎస్‌కె జోషి, అజయ్‌మిశ్రా, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వెంకటేష్‌ దేశ్‌ముఖ్‌, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, సంగీత దర్శకులు యశోకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని