logo

విభిన్న రుచులతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి

విభిన్న రుచుల వంటకాలతో హైదరాబాద్‌ ప్రపంచ ప్రఖ్యాతి ఆర్జించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు.

Published : 29 Jan 2022 03:32 IST


సమావేశంలో మాట్లాడుతున్న జయేశ్‌రంజన్‌, చిత్రంలో శంకర్‌, సంపత్‌, సరిత తదితరులు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: విభిన్న రుచుల వంటకాలతో హైదరాబాద్‌ ప్రపంచ ప్రఖ్యాతి ఆర్జించిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ను శుక్రవారం ప్రారంభించారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ ఇతర ప్రాంతాలకు చెందిన లక్షల మంది నగరంలో ఆతిథ్య, సేవా రంగాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఏఐ నేషనల్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు షాజ్‌ మహమ్మద్‌, హైదరాబాద్‌ చాప్టర్‌ విభాగాధిపతి శంకర్‌ కృష్ణమూర్తి, సహ విభాగాధిపతి సంపత్‌ తుమ్మల, సంయుక్త కార్యదర్శి కేతన్‌ అగర్వాల్‌, కోశాధికారి సరిత సర్కార్‌ తదితరులు పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షులు కబీర్‌ సూరి, ఉపాధ్యక్షులు సాగర్‌ దర్యానీ, సెక్రటరీ జనరల్‌ ప్రకుల్‌ కుమార్‌ వెబినార్‌ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని