Telangana : రైల్వేలోజాతీయస్థాయి పరీక్షల వల్ల ఆ రెండు రాష్ట్రాల పెత్తనం ఎక్కువైంది: వినోద్‌

జోనల్‌ స్థాయిలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ అన్నారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రికి వినోద్‌

Updated : 29 Jan 2022 19:01 IST

హైదరాబాద్‌: జోనల్‌ స్థాయిలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ అన్నారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రికి వినోద్‌ లేఖ రాశారు. రైల్వే ఉద్యోగ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్‌ సీ, డీ పోస్టులకు జాతీయస్థాయి పరీక్షలు సరికాదన్నారు. జాతీయ స్థాయి పరీక్షల వల్ల బిహార్, యూపీ పెత్తనం ఎక్కువైందని పేర్కొన్నారు. రైల్వే పరీక్షల్లో కోచింగ్‌ కేంద్రాల మాయజాలం పెరుగుతోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని సమూల ప్రక్షాళన చేయాలని వినోద్‌ కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని