logo

Crime News: యూట్యూబర్‌ సరయూపై కేసు

యూట్యూబర్‌ సరయూతో పాటు ఆమె బృందంపై బంజారాహిల్స్‌ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సరయూ, ఆమె బృందం ‘7 ఆర్ట్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌

Updated : 07 Feb 2022 07:40 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: యూట్యూబర్‌ సరయూతో పాటు ఆమె బృందంపై బంజారాహిల్స్‌ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సరయూ, ఆమె బృందం ‘7 ఆర్ట్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌’ కోసం లఘు చిత్రం రూపొందించి గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రంలో సరయూ, ఆమె బృందం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించారు. వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో పాటు మద్యం తాగి హోటల్‌కు వస్తారనే దుష్ప్రచారం అవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్‌ అక్కడి ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల ఠాణా ఇన్‌స్పెక్టర్‌.. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని ఫిలింనగర్‌లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించి బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని