logo

Hyderabad News: చరిత పుటలోకి గడ్డిఅన్నారం మార్కెట్‌!

గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ కథ ముగిసింది. మార్కెట్‌తో వ్యాపారులకు ఉన్న 35 ఏళ్ల అనుబంధానికి శుక్రవారంతో శాశ్వతంగా తెరపడింది. దేశ, విదేశాలకు చెందిన రకరకాల పండ్లను నగరవాసులకు

Updated : 19 Mar 2022 07:29 IST

నేలమట్టమైన నిర్మాణాలు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, చైతన్యపురి: గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ కథ ముగిసింది. మార్కెట్‌తో వ్యాపారులకు ఉన్న 35 ఏళ్ల అనుబంధానికి శుక్రవారంతో శాశ్వతంగా తెరపడింది. దేశ, విదేశాలకు చెందిన రకరకాల పండ్లను నగరవాసులకు పరిచయం చేసి.. అందరి ఆరోగ్యాలను కాపాడిన ఈ మార్కెట్‌ ఆవరణ ఇప్పుడు సరికొత్త వైద్య సేవలకు సిద్ధమవుతోంది. ఈ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఎన్నో ఏళ్ల బంధానికి ముగింపు..
పండ్ల మార్కెట్‌ ప్రాంగణంలోని దుకాణాలు ఖాళీ చేయాలన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో వ్యాపారులు శుక్రవారం తమ సామగ్రి తీసుకెళ్లారు. కమీషన్‌ ఏజెంట్లు, వారి వద్ద పని చేసే సిబ్బంది, రిటైల్‌ వ్యాపారులు, హమాలీలు, చిరు వ్యాపారులు ఇలా.. రెండు తరాల వారు ఇక్కడ ఉపాధి పొందారు. ఇంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న వారు.. మార్కెట్‌ను వదిలి వెళ్తున్న సమయంలో గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 1986లో జాంబాగ్‌ నుంచి గడ్డిఅన్నారం వచ్చిన సమయంలో తమకు అనుకూలంగా దుకాణాలు, షెడ్లు నిర్మించి ఇచ్చారని.. ఇప్పుడేమో తాత్కాలికంగా బాటసింగారానికి తరలించి ఎండలో పడేశారని పలువురు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని