logo

హాస్య నాటికల ఆద్యుడు సుందరం మాస్టారు కన్నుమూత

తెలుగు నాటక రంగానికి హాస్యంతో కొత్త శైలి చూపిన రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు (71) సోమవారం గుండెపోటుతో చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఉదయం

Published : 22 Mar 2022 08:47 IST

తల్లావఝ్జల సుందరం మాస్టారు

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: తెలుగు నాటక రంగానికి హాస్యంతో కొత్త శైలి చూపిన రంగస్థల నటులు, దర్శకుడు, నవలా రచయిత తల్లావఝ్జల సుందరం మాస్టారు (71) సోమవారం గుండెపోటుతో చిక్కడపల్లిలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందని తన మిత్రుడు తనికెళ్లభరణికి ఫోన్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఇద్దరు శిష్యులు ఆయన ఇంటికి చేరుకొని ముషీరాబాద్‌ కేర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. పలువురు రంగస్థల ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన కుమారుడు, కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తరువాత ఈనెల 23న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో 1950 అక్టోబరు 29న జన్మించిన సుందరం మాస్టారు బీఎస్సీ చదివిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగ స్థల కళల విభాగంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. నాలుగేళ్ల క్రితం ఆయన భార్య శిరీష మరణించారు. నాటక రచన, ప్రదర్శనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. రెండు వందలకుపైగా నాటకాల్లో నటించారు. నాటకానికి హాస్యం వైపు మళ్లించే ప్రయత్నంలో విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని