logo

కత్తితో దాడి చేసి.. ఆపై సెల్ఫీ దిగి..

తన ప్రేమికురాలిని ఇబ్బంది పెడతావా అంటూ కత్తితో దాడి చేశాడు.. రక్తం కారుతున్న మైనరును చేసిన తప్పు ఒప్పుకొని.. మరోసారి చేయనంటూ చెప్పాలని సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు.. ఆయా ఫొటోలను తన ప్రేయసికి

Published : 19 May 2022 02:11 IST

రక్తసిక్తమైన మైనర్ల ప్రేమ కథ

జూబ్లీహిల్స్‌:  తన ప్రేమికురాలిని ఇబ్బంది పెడతావా అంటూ కత్తితో దాడి చేశాడు.. రక్తం కారుతున్న మైనరును చేసిన తప్పు ఒప్పుకొని.. మరోసారి చేయనంటూ చెప్పాలని సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు.. ఆయా ఫొటోలను తన ప్రేయసికి పంపాడు. చివరకు ఈ ప్రేమకథ పోలీసు ఠాణా మెట్లు ఎక్కింది.. ఈ వ్యవహారం ‘బాలుర మధ్య చిచ్చురేపిన ప్రేమ’ పేరుతో వార్త సైతం ‘ఈనాడు’లో ప్రచురితమైంది. వివరాల్లోకి వెళితే ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌లో నివసించే ఓ మైనరు(16) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి కొద్ది రోజులుగా   అదే ప్రాంతంలో నివసించే బాలిక(16) వెంట పడుతున్నాడు. ఆ బాలిక లంగర్‌హౌజ్‌ సమీపంలోని ప్రశాంత్‌నగర్‌లో నివసించే ఇంటర్‌ విద్యార్థి రోహన్‌(19)తో  ప్రేమలో ఉంది. దీంతో పదో తరగతి విద్యార్థి గురించి రోహన్‌ దృష్టికి తీసుకెళ్లింది. రోహన్‌ తన స్నేహితులైన సంజయ్‌(19), అభిషేక్‌, నరేష్‌లతో కలిసి మంగళవారం రాత్రి  రెండు ద్విచక్ర వాహనాలపై ఫిలింనగర్‌ చేరుకున్నారు. విద్యార్థిని వేధిస్తున్న బాలుడిని వాహనంపై ఎక్కించుకొని లంగర్‌హౌజ్‌ సమీపంలోని బాపూఘాట్‌ వెనుక ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. రక్తం మడుగులో ఉన్న విద్యార్థితో మరోసారి వెంటపడనని చెప్పాలంటూ సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. వాటిని తన ప్రియురాలికి పంపాడు. అనంతరం విద్యార్థిని బాపూఘాట్‌ రోడ్డుపై వదిలేసి వారంతా వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు.. రోహన్‌, సంజయ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు