logo

‘తెలుగు జాతికి గర్వకారణం సుశీలమ్మ’

‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయే చందమామా.. పైన మఠం కట్టి చందమామా, కింద ఇల్లు కట్టి చందమామా’ అంటూ సుప్రసిద్ధ గాయని పి.సుశీలమ్మతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆలపించి

Published : 19 May 2022 02:11 IST

సుశీలమ్మను సత్కరిస్తున్న కల్వకుంట్ల కవిత, కోలేటి దామోదర్‌, మధుసూదనాచారి, చంద్రశేఖర్‌, బండారు సుబ్బారావు

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయే చందమామా.. పైన మఠం కట్టి చందమామా, కింద ఇల్లు కట్టి చందమామా’ అంటూ సుప్రసిద్ధ గాయని పి.సుశీలమ్మతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆలపించి ఆకట్టుకున్నారు. ఆర్‌.ఆర్‌.ఫౌండేషన్‌, శృతిలయ ఆర్ట్స్‌ అకాడమీ, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌, తిరుమల బ్యాంక్‌ల ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో పి.సుశీలమ్మ పాటకు 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆమెకు పౌరసత్కారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుంట్ల కవిత ఆమెతో కలిసి బతుకమ్మ పాటను పాడి మురిపించారు. సుశీలమ్మ.. తన చేతికున్న ఉంగరాన్ని బహుమతిగా కవితకు తొడిగారు.  తిరుమల బ్యాంక్‌ ఛైర్మన్‌ నంగునూరి చంద్రశేఖర్‌ అధ్యక్షోపన్యాసం చేయగా సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ అధినేత బండారు సుబ్బారావు ప్రారంభోపన్యాసం చేశారు. నిర్వాహకురాలు  ఆమని సారథ్యంలో సుశీలమ్మ సినీ సుస్వరాలు సమర్పించారు. సభలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌, స్టాంజో ఇండియా డైరెక్టర్‌ నీరజ్‌ లకోటియా, తెలంగాణ శోభన్‌బాబు సేవా సమితి ఛైర్మన్‌ రామకృష్ణ, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫీ, ఆదర్శ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కుసుమ భోగరాజు, దైవజ్ఞశర్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని