logo

అన్నదాత.. ఐదుగురికి ప్రాణదాత

ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి పడి తీవ్రగాయాలకు గురై బ్రెయిన్‌ డెడ్‌ అయిన అన్నదాత.. పలువురికి ప్రాణదాతగా నిలిచారు.. కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అవయవదానం చేయడంతో

Published : 19 May 2022 02:11 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి పడి తీవ్రగాయాలకు గురై బ్రెయిన్‌ డెడ్‌ అయిన అన్నదాత.. పలువురికి ప్రాణదాతగా నిలిచారు.. కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అవయవదానం చేయడంతో ఐదుగురికి పునర్‌జన్మ లభించింది. సంగారెడ్డికి చెందిన మస్గోని శ్రీనివాస్‌ (38) రైతు. ఆయనకు భార్య లక్ష్మి, కుమారుడు సాయిచరణ్‌, కూతురు స్ఫూర్తి ఉన్నారు. ఈనెల 13న ఆయన ఇంటి వద్ద మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తలకు బలమైన గాయమైంది.  ఈ నెల 17న బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారు. వేదనను దిగమింగి భార్య, సోదరుడు ఆయన అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో జీవన్‌దాన్‌ సంస్థకు లివర్‌ (కాలేయం), రెండు కిడ్నీలు (మూత్రపిండాలు), రెండు కళ్లు దానం చేశారు. ఆ సంస్ధ ద్వారా అత్యవసరమున్న రోగులకు అమర్చేందుకు.. లివర్‌, ఒక కిడ్నీ కాంటినెంటల్‌ ఆసుపత్రికి, మరో కిడ్నీ నిమ్స్‌ ఆసుపత్రికి, కళ్లు సరోజినీ దేవీ నేత్ర వైద్యశాలకు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని