logo

కేఏ పాల్‌ సమావేశానికి అనుమతి నిరాకరణ

వృద్ధులు, వితంతువులు, అనాథ బాలల సంక్షేమం కోసమంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కే.ఎ.పాల్‌ బేగంపేట చికోటి గార్డెన్స్‌లోని జీవన్‌జ్యోతి క్యాంపస్‌లో బుధవారం

Published : 19 May 2022 02:11 IST

బేగంపేట, న్యూస్‌టుడే: వృద్ధులు, వితంతువులు, అనాథ బాలల సంక్షేమం కోసమంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కే.ఎ.పాల్‌ బేగంపేట చికోటి గార్డెన్స్‌లోని జీవన్‌జ్యోతి క్యాంపస్‌లో బుధవారం నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని అనుమతిలేని కారణంగా పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం పాస్టర్లు, బిషప్‌ల సమావేశం కోసం కొందరు పాస్టర్లు జీవన్‌జ్యోతి క్యాంపస్‌లో సమావేశానికి అనుమతి తీసుకున్నారు. సమావేశానికి కేఏ పాల్‌ హాజరవుతున్నట్లు తెలిసిన కొందరు వ్యక్తులు జీవన్‌జ్యోతి కేంద్రం నిర్వాహకులకు ఫోన్‌ చేశారు. పాల్‌ సమావేశాన్ని తాము అడ్డుకుంటామని చెప్పినట్లు తెలిసింది. దీంతో జీవన్‌జ్యోతి క్యాంపస్‌ నిర్వాహకులు ఎటువంటి సమావేశానికి తాము అనుమతివ్వబోమంటూ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు జీవన్‌జ్యోతి క్యాంపస్‌కు వెళ్లే రహదారిని బారికేడ్లతో మూసి, బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను బేగంపేటలో నిర్వహించాలనుకున్న సమావేశాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం రూ.కోటి వెచ్చించి మరీ అడ్డుకుందని కేఏ పాల్‌ ఆరోపించారు. అమీర్‌పేటలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ప్రాణహాని జరిగితే బాధ్యత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని