Telangana News: పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తే తప్పని ఎలా అంటారు?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

Published : 20 May 2022 01:40 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుసరిస్తున్న తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. గత సంవత్సరం యాసంగిలో 92 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది యాసంగిలో నిన్నటి వరకు కేవలం 20 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనందున రైతులు రూ.1,400కే అమ్ముకోవాల్సి వచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం తప్పని సీఎం కేసీఆర్‌ ఏలా అంటారని ఉత్తమ్‌ ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలు బలపడాలని నేరుగా నిధులు ఇచ్చే విధానాన్ని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. పంచాయతీలకు వచ్చే నిధులు పెంచాలని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ తీరుతో తెలంగాణలో సర్పంచ్‌ల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని