logo

సెల్లార్‌ తవ్వకాలపై నిషేధం

వర్షాకాలం సమీపించడంతో కొత్త సెల్లార్లు తవ్వడంపై జీహెచ్‌ఎంసీ నిషేధం విధించింది. ఇప్పటికే తవ్వినవి, పనులు పురోగతిలో ఉన్నవి, ఎప్పుడో తవ్వి వదిలేసినవి, పని....

Updated : 20 May 2022 05:33 IST

వర్షాకాలం పూర్తయ్యే వరకు కొత్తవి వద్దన్న బల్దియా

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలం సమీపించడంతో కొత్త సెల్లార్లు తవ్వడంపై జీహెచ్‌ఎంసీ నిషేధం విధించింది. ఇప్పటికే తవ్వినవి, పనులు పురోగతిలో ఉన్నవి, ఎప్పుడో తవ్వి వదిలేసినవి, పని ప్రదేశంలో కూలీల భద్రత, ఇతరత్రా అంశాలపై కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌ జోన్లు, సర్కిల్‌ కార్యాలయాలకు పలు ఆదేశాలిచ్చారు. తవ్వి నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్లను నిర్మాణ వ్యర్థాలతో పూడ్చేయాలని ఆదేశిస్తూ యజమానులకు నోటీసులివ్వాలని స్పష్టం చేశారు. మిగిలిన అంశాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 25 నాటికి నివేదిక సమర్పించాలన్నారు.

ఆదేశాలు ఇలా..

* పురోగతిలో ఉన్న సెల్లార్లను తనిఖీ చేసి అనుమతులను పరిశీలించాలి. భద్రత చర్యలను గమనించి లోపాలను గుర్తించాలి. బారికేడ్ల ఏర్పాటు, ఇతర భద్రత ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా నిర్మాణదారులకు సూచించాలి. సెల్లార్ల తవ్వకం పనులను ఫొటో తీసి నివేదికలో పొందుపరచాలి.

* తవ్వి ఉన్న సెల్లార్ల వద్ద లోపాలను గుర్తించి నిర్మాణదారులకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. నోటీసుకు స్పందించకపోతే నిర్మాణ అనుమతి రద్దు చేయడంతోపాటు నిర్మాణదారు లైసెన్సు రద్దు చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి.
* కొండలు, గుట్టల వద్ద రాళ్లను పగలగొట్టేవారిని అడ్డుకోండి. గుట్టల కింద తవ్విన సెల్లార్లను గుర్తించి, అక్కడ నేల కోతకు గురయ్యే పరిస్థితి ఉంటే.. అవసరమైన చర్యలు తీసుకోవాలి.

* నిర్మాణ పనుల వద్ద కార్మికులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఆవాసాల భద్రత, అందుకు నిర్మాణదారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి.. లోపాలుంటే బాధ్యులకు నోటీసులివ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని