సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం
బాలిక గర్భం దాల్చడంతో వెలుగు చూసిన ఘటన
నిజాంపేట, న్యూస్‌టుడే: వావీవరుసలు మరిచిన ఓ కళాశాల విద్యార్థి సొంత చెల్లెలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆ బాలికను ఐదు నెలల గర్భవతిని చేశాడు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి ఠాణా పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. కేరళ నుంచి నగరానికి వలసొచ్చిన ఓ కుటుంబం బాచుపల్లి పరిధిలోని ఓ కాలనీలో నివాసం ఉంటోంది. కుటుంబ యజమాని వ్యాపారం నిర్వహిస్తుండగా భార్య ఐటీ ఉద్యోగి. వీరి కుమారుడు(17) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె(13) తొమ్మిదో తరగతి చదువుతోంది. వీరిద్దరు ఇంట్లో ఒకే గదిలో నిద్రించేవారు. ఈ నేపథ్యంలో చెల్లెలిని లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. తరువాత బాలికకు కడుపునొప్పి రావడంతో మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. దాంతో బాలిక గర్భవతని తేలింది. బాలికకు అబార్షన్ చేయించడానికి ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు విషయాన్ని మేడ్చల్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం(డీసీపీయూ)కు సమాచారం ఇచ్చారు. ఆ విభాగం అధికారుల ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు నిందితుడిపై ఐపీసీ376(2) సెక్షన్‌తో పాటు పోక్సో చట్టం కింద ఈ నెల 17న కేసు నమోదు చేశారు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలించినట్లు సీఐ కె.నర్సింహారెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Raghurama: రైలును తగులబెట్టి నన్ను హత్య చేయాలని చూశారు: ఎంపీ రఘురామ
-
World News
Snake Island: స్నేక్ ఐలాండ్‌పై ఎగిరిన ఉక్రెయిన్ పతాకం
-
Sports News
IND vs ENG: గెలుపు దిశగా ఇంగ్లాండ్.. శతకాలకు చేరువలో రూట్, బెయిర్‌స్టో
-
Business News
Electric vehicles: ఈవీ కంపెనీలకు కేంద్రం షోకాజ్ నోటీసులు.. నెలాఖరు డెడ్‌లైన్!
-
India News
Spicejet: స్పైస్‌జెట్ విమానంలో సాంకేతికలోపం.. కరాచీలో అత్యవసర ల్యాండింగ్
-
Crime News
Hyderabad: దోషం ఉంది.. శాంతి చేయాలని ₹37 లక్షలు స్వాహా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)