logo

‘గాంధీ’లో ఒకేరోజు ఆరు కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు

ఆయుష్మాన్‌భారత్‌, ఆరోగ్యశ్రీ పథకాల కింద సికింద్రాబాద్‌ గాంధీఆసుపత్రిలో ఒకేరోజు ఆరు కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

Published : 20 May 2022 02:49 IST


కీళ్లమార్పిడి చేయించుకున్న వారితో గాంధీ ఆస్పత్రి వైద్యసిబ్బంది

గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఆయుష్మాన్‌భారత్‌, ఆరోగ్యశ్రీ పథకాల కింద సికింద్రాబాద్‌ గాంధీఆసుపత్రిలో ఒకేరోజు ఆరు కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్‌ విభాగంలో ప్రొఫెసర్‌ వాలియా, అనస్తీషియా విభాగం డాక్టర్‌ బేబీరాణి, నర్సింగ్‌స్టాఫ్‌ ఇన్‌ఛార్జ్‌ సునీతల ఆధ్వర్యంలో బుధవారం ఆరుగురికి కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేపట్టారు. ఆర్థో విభాగంలో అదనంగా కీలకమైన కీళ్లమార్పిడి ఆపరేషన్లు నిర్వహించి సక్సెస్‌ను సాధించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి పి.శ్రావణ్‌కుమార్‌, ఆర్థోపెడిక్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బన్సీలాల్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని