logo

యజమాని హత్య.. దోషికి యావజ్జీవ శిక్ష

ఉపాధి కల్పించి ఇంట్లోనే ఆశ్రయమిచ్చి ఆదుకున్న యజమానిని దారుణంగా హత్య చేసి ప్రతిఘటించిన ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపర్చిన నిందితుడికి న్యాయస్థానం జీవితఖైదు, రూ.800 జరిమానా విధించింది.

Published : 20 May 2022 02:49 IST


విక్రం

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ఉపాధి కల్పించి ఇంట్లోనే ఆశ్రయమిచ్చి ఆదుకున్న యజమానిని దారుణంగా హత్య చేసి ప్రతిఘటించిన ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపర్చిన నిందితుడికి న్యాయస్థానం జీవితఖైదు, రూ.800 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం... ఒడిశా రాష్ట్రానికి చెందిన విక్రం(22) పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం వచ్చి రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం జల్‌పల్లికి రాగా అక్కడ ఎస్‌ఎస్‌ గ్లాస్‌ ట్రేడింగ్‌ పేరిట ఫ్యాక్టరీ నడుపుతున్న నరేందర్‌రాయ్‌(52) చేరదీసి ఉచిత భోజనంతో పాటు తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. ఫ్యాక్టరీ నుంచి నెలకు రూ. లక్షల్లో ఆదాయం వస్తోందని గ్రహించి 2020 అక్టోబరు 3న రాత్రి నిద్రిస్తున్న నరేందర్‌రాయ్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశాడు. అడ్డొచ్చిన అతని భార్య రీనా రాయ్‌, తమ్ముడు ఇంద్రసేనారాయ్‌, కూతురు శ్వేతారాయ్‌ను గాయపరిచి పరారయ్యాడు. ఈ కేసు విచారించిన రంగారెడ్డి జిల్లా మూడో అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి కె.శైలజ గురువారం తుది తీర్పు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని