logo

ట్రక్కులు అపహరించి తుక్కు చేస్తున్న ముగ్గురి అరెస్టు

పార్కింగ్‌ చేసిన ట్రక్కులు అపహరించి తుక్కు చేసి విక్రయిస్తున్న ముగ్గురిని శంషాబాద్‌ పోలీసులు గురువారం కటకటాల్లోకి నెట్టారు. హరియాణాకు చెందిన ఓ ట్రక్కు, ఓ కారు, బైక్‌, రూ.50 నగదు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

Published : 20 May 2022 02:49 IST


షేక్‌ హజీ                         ఇర్ఫాన్‌                     అహ్మద్‌ పాషా

శంషాబాద్‌: పార్కింగ్‌ చేసిన ట్రక్కులు అపహరించి తుక్కు చేసి విక్రయిస్తున్న ముగ్గురిని శంషాబాద్‌ పోలీసులు గురువారం కటకటాల్లోకి నెట్టారు. హరియాణాకు చెందిన ఓ ట్రక్కు, ఓ కారు, బైక్‌, రూ.50 నగదు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ఆర్‌.జగదీశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌, నాంపల్లికి చెందిన షేక్‌ హజీ లారీ మెకానిక్‌. గగన్‌పహాడ్‌లో ట్రక్కులకు మరమ్మతులు చేస్తుండేవాడు. అందులో నష్టపోయి అన్వర్‌తో కలిసి ట్రక్కుల చోరీ బాట పట్టాడు. గతంలో మైలార్‌దేవ్‌పల్లి, నల్గొండ ఠాణా పరిధిలో లారీలను చోరీ చేసి హజీ జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చి బహదూర్‌పురాకు చెందిన ఎండీ.ఇర్ఫాన్‌, కాలపత్తార్‌కు చెందిన ఎండీ.అహ్మద్‌పాషా, ఎండీ.అన్వర్‌, ఎండీ.ఫైసల్‌, ఎండీ నిజాం, ఎండీ హలీమ్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ట్రక్కులు చోరీ చేసి అధిక ధరలకు విక్రయించడం, తుక్కు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నెల 8న పాలమాకుల వద్ద పార్కింగ్‌ చేసిన ఓ ట్రక్కును అపహరించి తుక్కుగా మార్చి బీదర్‌లో అమ్మేశారు. అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న షేక్‌ హజీ, ఇర్ఫాన్‌, అహ్మద్‌ పాషాలను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని