logo
Published : 20 May 2022 03:43 IST

నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: కార్మికుల పిల్లలకు వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఇష్టమైన రంగంలో తీర్చిదిద్ది భవితకు బంగారు బాటలు వేసేందుకు కార్మిక సంక్షేమ మండలి, సెట్విన్‌ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు స్వయం ఉపాధి కోర్సుల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. కార్మిక కార్డులున్న కుటుంబాలకు ఉచిత శిక్షణతో పాటు తగిన భృతిని చెల్లిస్తారు. జిల్లాలో 1.40 లక్షల మంది కార్మికులు ఉంటారు. వీరిలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే వారు సుమారుగా 46 వేల మంది వరకు ఉన్నారు. వీరిపై ఆధారపడి జీవించే కుటుంబ సభ్యుల సంఖ్య మూడింతలు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో తరగతులు: కార్మిక కార్డు ఉన్నవారి పిల్లలకే అవకాశం ఉందని, వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. మొదటి విడతగా జిల్లాలో 1,250 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి బృందాల వారీగా శిక్షణ కొనసాగనుంది. కోర్సు ప్రకారం మూడు నుంచి ఆరు నెలల వ్యవధి ఉంటుంది. అభ్యర్థి వీలును బట్టి మెబైల్‌ ద్వారా కోర్సు నేర్చుకోవచ్ఛు శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి పత్రాలను అందజేస్తారు

మూడు నెలల కోర్సులు: డీటీపీ, ఎంఎస్‌ ఆఫీస్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, హౌజ్‌ వైరింగ్‌, సీసీ++, ట్యాలీ, ఫైతాన్‌, మెకానికల్‌ ఆటో, సివిల్‌ ఆటో, పీసీబీ డిజైన్‌, ఎంబ్రాయిడరీ, మెట్‌ల్యాబ్‌, ఇమెజ్‌ ప్రాసెసింగ్‌, ఐఓటీ, రోబోటిక్స్‌, త్రీ డీ ప్రింటింగ్‌.

ఆరు నెలలు: డిప్లామా ఇన్‌ కంప్యూటర్స్‌ హార్డ్‌వేర్‌, జావా, ఇంటర్‌నెట్‌, ఎఐ అండ్‌ ఎంఎల్‌.

పన్నెండు నెలల: గేట్‌, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌, బీఎస్‌ఆర్‌బీ.

* ఆన్‌లైన్‌లో కోర్సు నేర్చుకునేందుకు గుర్తింపు పొందిన లేబర్‌ కార్డు, దరఖాస్తుదారుని ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, విద్యార్హతను తెలిపే ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా ఉండాలి.


ఎంపిక చేసిన వారికి వారంలో పాఠాలు

సాద్విక్‌, ప్రాజెక్టు మేనేజర్‌

కోర్సులకు సంబంధించిన ఆన్‌లైన్‌ తరగతులను దేశంలోనే అనుభవజ్ఞులైన ఐటీ నిపుణులతో రూపొందించారు. త్రీడీ విధానంలో వీటిని తయారు చేశారు. అవసరం ఉన్న వారు వీటిని జూమ్‌ చేసి చూడవచ్ఛు ప్రభుత్వరంగ సంస్థ అయిన సెట్విన్‌ ఆధ్వర్యంలో ఈ యూప్‌ను రూపొందించారు. ఎంపికైన అభ్యర్థులకు ఐడీ పాస్‌వర్డ్‌ ఇస్తారు. దీని ద్వారా యాప్‌ను తెరచి పాఠాన్ని వీక్షించవచ్ఛు ఎంపిక చేసిన అభ్యర్థులకు వారంలో పాఠాలు ప్రారంభిస్తాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని