logo

క్రికెట్‌ బెట్టింగ్‌ వద్దన్న తండ్రి.. కుమారుడి ఆత్మహత్య

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడవద్దని తండ్రి మందలించడంతో ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. హస్మత్‌పేట్‌లోని అంజయ్యనగర్‌లో ఉండే కనకయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జీహెచ్‌ఎంసీలో డీఈ.

Published : 21 May 2022 06:00 IST

రెజిమెంటల్‌బజార్‌, అల్వాల్‌, న్యూస్‌టుడే: క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడవద్దని తండ్రి మందలించడంతో ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్‌ పోలీసుల కథనం ప్రకారం.. హస్మత్‌పేట్‌లోని అంజయ్యనగర్‌లో ఉండే కనకయ్యకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జీహెచ్‌ఎంసీలో డీఈ. చిన్నకుమారుడు సంతోష్‌కుమార్‌(30) ఎల్‌అండ్‌టీలో మార్కెటింగ్‌ ఉద్యోగి. కొంతకాలంగా ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు. గమనించిన తండ్రి గురువారం రాత్రి మందలించగా మనస్తాపానికి గురై అదేరోజు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.

బాలకార్మికులకు విముక్తి

ఓ హోటల్‌ పనిచేస్తున్న బాలకార్మికులకు బాలల పరిరక్షణ అధికారులు విముక్తి కల్పించి, హోటల్‌ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓల్డ్‌ అల్వాల్‌లోని అన్నపూర్ణ మెస్‌లో ముగ్గురు బాలురు పనిచేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మేడ్చల్‌ జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు తన బృందంతో హోటల్‌పై దాడి చేయగా బిహార్‌, కర్ణాటకకు చెందిన బాలురను గుర్తించారు. నెలరోజులుగా పనిచేస్తున్న వారిని పరిరక్షణ కేంద్రానికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని