Hyd News: వైద్యుడి వేషంతో ఐసీయూలోకి అక్రమంగా ప్రవేశించి..

వైద్యుడి వేషంతో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించడమే కాకుండా రోగి బంధువులను డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.

Updated : 21 May 2022 06:47 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: వైద్యుడి వేషంతో ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించడమే కాకుండా రోగి బంధువులను డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను పంజాగుట్ట సీఐ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో బంజారాహిల్స్‌ లోని విరించి ఆసుపత్రిలో చేర్చించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈనెల 16న గుర్తుతెలియని వ్యక్తి వైద్యుడి వేషధారణతో ఐసీయూలోకి వెళ్లాడు. రోగి కేసష్‌ీట్‌ను పరిశీలించి ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. రోగి బంధువులకు ఫోన్‌ చేసి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని, తక్షణం రూ.50వేలు పంపించాలని చెప్పాడు. విస్తుపోయిన బంధువులు తమకు ఈఎస్‌ఐ వర్తిస్తుందని, డబ్బులెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఆసుపత్రి యాజమాన్యం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుణ్ని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జకీరుద్దీన్‌(19)గా గుర్తించి రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని