logo

‘గాంధీ’లో మరో అరుదైన శస్త్రచికిత్స

గాంధీ ఆసుపత్రిలో రివర్స్‌ షోల్డర్‌ ఆర్థోప్లాస్టీ ఆపరేషన్‌ను మొదటిసారిగా నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన రైతు లక్ష్మయ్య(85)కు పదేళ్ల కిందట కుడి భుజానికి తీవ్ర గాయమైంది.

Published : 21 May 2022 06:00 IST

కోలుకున్న లక్ష్మయ్య

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో రివర్స్‌ షోల్డర్‌ ఆర్థోప్లాస్టీ ఆపరేషన్‌ను మొదటిసారిగా నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. హనుమకొండ జిల్లా శాయంపేటకు చెందిన రైతు లక్ష్మయ్య(85)కు పదేళ్ల కిందట కుడి భుజానికి తీవ్ర గాయమైంది. గతేడాది నుంచి తీవ్ర నొప్పితో చేతిని కదపలేని స్థితికి చేరడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. లక్షలాది రూపాయలు ఖర్చవుతుందనడంతో ఈనెల మొదటి వారంలో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. భుజం వద్ద ఎముక విరిగినట్లు ఎక్స్‌రేలో వైద్యులు గుర్తించారు. ఎమ్మారై స్కానింగ్‌లో భుజానికి ఉన్న రొటేటర్‌ కప్‌ సైతం విరిగినట్లుతెలుసుకున్నారు. ఆ ఆపరేషన్‌ను సవాల్‌గా తీసుకున్న వైద్యులు ఐదుగంటలపాటు శ్రమించి రివర్స్‌ షోల్డర్‌ ఆర్థోప్లాస్టీ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం లక్ష్మయ్య కోలుకుని క్షేమంగా ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని