logo

రైలు దిగగానే బస్టాప్‌ చేరేలా..

దూరప్రాంతాల నుంచి రైలులో సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు గందరగోళం లేకుండా టీఎస్‌ఆర్టీసీ పలు చర్యలు తీసుకుంటోంది. సికింద్రాబాద్‌ స్టేషన్లోని 1, 10 ప్లాట్‌ఫారంలపై ‘మే ఐ హెల్ప్‌యూ’ పేరిట సమాచార కేంద్రాలు

Published : 21 May 2022 06:00 IST

● ఆర్టీసీ సమాచార కేంద్రాలు, ఎలక్ట్రిక్‌ వాహనాలు


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ముందు ట్రాఫిక్‌ గందరగోళ పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి రైలులో సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ప్రయాణికులు నగరంలోని తమ గమ్యస్థానానికి వెళ్లేందుకు గందరగోళం లేకుండా టీఎస్‌ఆర్టీసీ పలు చర్యలు తీసుకుంటోంది. సికింద్రాబాద్‌ స్టేషన్లోని 1, 10 ప్లాట్‌ఫారంలపై ‘మే ఐ హెల్ప్‌యూ’ పేరిట సమాచార కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రయాణికులు ఎక్కడికెళ్లాలో కనుక్కొని.. వారికి బస్సుల సమాచారమిస్తారు. ఏ బస్సులెక్కడ ఆగుతాయో వివరిస్తారు. స్టేషన్‌ ప్రధానద్వారాలతోపాటు.. అన్ని ప్లాట్‌ఫారంలు, పాదచారుల వంతెనలపైన డిజిటల్‌ సైన్‌బోర్డులు ఏర్పాటుచేసి బస్సుల సమాచారమిస్తారు. బస్‌స్టేషన్‌ చేరేవరకు సైన్‌బోర్డులు ఏర్పాటుచేస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

స్టేషన్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలు.. సామాన్లతో వచ్చే ప్రయాణికులను బస్‌స్టేషన్లో దింపేందుకు సమాచార కేంద్రాల వద్దే టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ వాహనాలనూ ఉంచుతోంది. ఇందుకు సాధారణ ఛార్జీలు వసూలుచేస్తారు. స్టేషన్‌కు కిలోమీటరున్నర వరకూ దూరముండే బస్టాపుల వరకూ ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రయాణికులను చేరవేస్తారు. మెట్రోస్టేషన్లకూ తీసుకెళ్తారు. ఈమేరకు రైల్వే అధికారులతో చర్చలు జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని