logo

ఆర్థిక వనరుల ఉత్పత్తి కేంద్రాలుగా గోశాలలు

దేశంలోని గోశాలలను ఆర్థిక వనరుల ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ) జాతీయ ఛైర్మన్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా ప్రకటించారు. రెండు గోవులున్న వారికి రోజుకు రూ.225 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

Published : 21 May 2022 06:00 IST

కేవీఐసీ జాతీయ ఛైర్మన్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా


సావనీర్‌ విడుదల చేస్తున్న కేవీఐసీ జాతీయ ఛైర్మన్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా (కుడి నుంచి నాలుగో వ్యక్తి), తదితరులు
బోరబండ, న్యూస్‌టుడే: దేశంలోని గోశాలలను ఆర్థిక వనరుల ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ) జాతీయ ఛైర్మన్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా ప్రకటించారు. రెండు గోవులున్న వారికి రోజుకు రూ.225 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యూసుఫ్‌గూడలోని సూక్ష్మ, లఘు, చిన్నతరహా పరిశ్రమల జాతీయ కేంద్రం (నిమ్స్‌మే)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన గోశాల నిర్వాహకుల సమ్మేళనం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పేడతో తయారు చేసిన ప్రాకృతిక పెయింట్‌ ఇతర వాటి కంటే నాణ్యమైనదని, 50 శాతం తక్కువ ధరలోనే లభిస్తోందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 39 పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఖాదీ కమిషన్‌ కిలో పేడను రూ.5కు కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. మృతదేహాల తయారీకి ఆవుపేడతో వంట చెరకు తయారు చేయనున్నామని సక్సేనా చెప్పారు.కేవీఐసీ దక్షిణాది రాష్ట్రాల సభ్యుడు పేరాల శేఖరరావు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద గోశాల నిర్వాహకులు సమ్మేళనంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పంచగవ్య ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని