logo

దొరికితే మధుర ఫలమే!

ఈ ఏడాది మే మధ్యలో ఉన్నా మధురఫలం మార్కెట్లో అంతగా కనిపించడం లేదు. కిలో రూ.100కి లోపు తగ్గడం లేదు బంగినపల్లి మామిడి పండు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు వరకూ వర్షాలు విరివిగా పడ్డాయి. దీంతో జనవరి వచ్చినా మామిడి చెట్లకు పూత కనిపించలేదు.

Published : 21 May 2022 06:00 IST

ఈనాడు - హైదరాబాద్‌

ఈ ఏడాది మే మధ్యలో ఉన్నా మధురఫలం మార్కెట్లో అంతగా కనిపించడం లేదు. కిలో రూ.100కి లోపు తగ్గడం లేదు బంగినపల్లి మామిడి పండు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు వరకూ వర్షాలు విరివిగా పడ్డాయి. దీంతో జనవరి వచ్చినా మామిడి చెట్లకు పూత కనిపించలేదు. మసి మంగు వ్యాధి సోకి పువ్వు దశలోనే రాలిపోయింది. దీంతో 40 శాతం పంట మాత్రమే రైతులకు దక్కింది. గతంలో వంద టన్నులు వచ్చిన పంట ఈసారి 40 టన్నులకు పడిపోయింది. ఏటా ఫిబ్రవరి నుంచి పంట మొదలై మే ఆఖరుకు పూర్తయ్యేది. ఈ సారి ఏప్రిల్‌ 10 వరకూ మార్కెట్‌కు రాలేదు. జూన్‌ 10 నాటికి వచ్చే అవకాశం ఉంది.

హోల్‌సేల్‌ మార్కెట్లోనే కిలో రూ. 55

నగర శివార్లలోని బాటసింగారం హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌కు రోజూ కల్వకుర్తి, కొల్లాపూర్‌, వనపర్తి, ఐజా, రంగారెడ్డి, అనంతపురం ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. అలాగే చిత్తూరు, కృష్ణా జిల్లాల నుంచి రైతులు ఇక్కడకే తీసుకువచ్చి అమ్ముతుంటారు. బుధవారం 1500 టన్నుల మామిడి వచ్చింది. మేలు రకం బంగినపల్లి మామిడి టన్ను రూ. 55వేలు పలికింది. అంటే కిలో రూ.55 పలికినట్టయింది. నగరానికి చిన్నరసాలు, పెద్ద రసాలు, దసేరి, కేసరి రకాల పండ్ల తాకిడి బంగినపల్లితో పోల్చితే తక్కువే. దిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లోని ముఖ్య పట్టణాలకు తరలిపోతోంది. రోజూ 35 నుంచి 40 కంటైనర్ల(15 టన్నుల లోడు)వరకూ ఇలా వెళ్తోందని బాటసింగారంలోని హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌ ప్రత్యేక ఉన్నత శ్రేణి కార్యదర్శి నరసింహారెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని