logo

సత్వరం ఉపాధి కూలీలకు ఖాతాలు

జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న 16 వేల ఉపాధి హామీ కూలీల ఖాతాలను వెంటనే తెరిపించాలని పాలనాధికారిణి నిఖిల అధికారులను అదేశించారు. శనివారం దృశ్య మాధ్యమం ద్వారా డీఆర్‌ డీఓ కృష్ణన్‌తో కలిసి

Published : 22 May 2022 03:46 IST


డీఆర్‌డీఓ కృష్ణన్‌తో కలిసి మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న 16 వేల ఉపాధి హామీ కూలీల ఖాతాలను వెంటనే తెరిపించాలని పాలనాధికారిణి నిఖిల అధికారులను అదేశించారు. శనివారం దృశ్య మాధ్యమం ద్వారా డీఆర్‌ డీఓ కృష్ణన్‌తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో ఉపాధి హామీ, హరితహారం పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శనివారం రాత్రి, ఆదివారం అధికారులు పల్లెల్లో నిద్ర చేసి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. గ్రామాల్లో బృందాలుగా ఏర్పాటు చేసి సోమవారం లోపు వంద శాతం ఖాతాలను తెరిపించాలని సూచించారు. పల్లె నిద్రలో పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా గ్రామాల్లో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని ఆమె పేర్కొన్నారు.

పెద్దేముల్‌ మండల ఏపీఓపై వేటు

ఉపాధి హామీ పథకం విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దేముల్‌ మండల ఏపీఓ నర్సిములును పాలనాధికారిణి నిఖిల సస్పెండ్‌ చేశారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ హాల్‌లో ఉపాధి హామీ, హరితహారంపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలకు కూలీ చెల్లింపులో జాప్యంతో పాటు విధులపై నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని గుర్తించి సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని