logo

Crime News: మరిది కొట్టడంతో వదిన ఆత్మహత్య.. శవాన్ని మూటలో కట్టి..

కేవలం తాము కొట్టినందుకే మనో వేదనతో ఆత్మహత్య చేసుకుందని, బయటకు తెలిస్తే గొడవవుతుందని సొంత వదిన శవాన్ని సంచిలో కట్టి తీసుకువెళ్లి ఆమె మరిది సింగూర్‌ డ్యాంలో పడేశాడు. ఈ ఘటన మోమిన్‌పేట ఠాణా పరిధిలో

Updated : 22 May 2022 10:45 IST

వదిన శవం సంచిలో కట్టి సింగూర్‌ డ్యాంలో పడవేత

మోమిన్‌పేట: కేవలం తాము కొట్టినందుకే మనో వేదనతో ఆత్మహత్య చేసుకుందని, బయటకు తెలిస్తే గొడవవుతుందని సొంత వదిన శవాన్ని సంచిలో కట్టి తీసుకువెళ్లి ఆమె మరిది సింగూర్‌ డ్యాంలో పడేశాడు. ఈ ఘటన మోమిన్‌పేట ఠాణా పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై విజయ్‌ప్రకాష్‌ తెలిపిన ప్రకారం...మండల పరిధి అమ్రాదికలాన్‌ గ్రామానికి చెందిన సంఘముని (45)భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి కూతుళ్లు, మరిది మేకల శ్రీనివాస్‌, మామ బీరయ్య అందరూ కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లుగా వారి మధ్య సొంత భూమి 10 ఎకరాలకు సంబంధించి వివాదాలు సాగుతున్నాయి. గత ఆదివారం రాత్రి మామ, మరిది అతని భార్య లక్ష్మి కలిసి గొడవ పెట్టుకొని ఆమెను కొట్టారు. మనస్తాపానికి గురైన ఆమె మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్తున్నానని చెప్పి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలసుకున్న మరిది గ్రామ పెద్దలకు తెలిస్తే కుటుంబ సభ్యులకు శిక్ష పడుతుందని ఎవరికీ అనుమానం రాకుండా తన స్నేహితుడు శ్రీహరి సహాయంతో శవాన్ని బావిలో నుంచి వెలికి తీసి ఓ మసాల సంచిలో కట్టి ద్విచక్ర వాహనంపై సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం పరిసరాలలోని సింగూర్‌ డ్యాం వంతెన పైనుంచి నీటిలో పడేశాడు. ఏమీ తెలియనట్టు మంగళవారం అతను ఠాణాకు వచ్చి తన వదిన కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశాడు. మహిళ అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను విచారించగా సంఘముని మృతికి కారణం కుటుంబ సభ్యులేనని తేలింది. మరిదిని తమదైన శైలిలో విచారించగా శవాన్ని సింగూర్‌ డ్యాంలో పడేసినట్టు చెప్పాడు. శనివారం డ్యాం దగ్గరికి వెళ్లి శవాన్ని వెలికి తీశారు. నిందితులను విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని