logo

గ్రంథాలయానికి.. పుస్తక సాయం

అవన్నీ గ్రామీణ గ్రంథాలయాలు.. యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ప్రభుత్వం 80వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో

Published : 22 May 2022 04:30 IST

నేడు పంపిణీ చేయనున్న టీఎస్‌ఎల్‌ఏ

ఈనాడు, హైదరాబాద్‌: అవన్నీ గ్రామీణ గ్రంథాలయాలు.. యువత, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ప్రభుత్వం 80వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా గ్రంథాలయాలకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయాల సంఘం(టీఎస్‌ఎల్‌ఏ) ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 20 గ్రంథాలయాలకు పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆదివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా నిర్వాహకులకు అందించనున్నారు. రాష్ట్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న 20 గ్రంథాలయాలకు పుస్తకాలను విరాళంగా ఇచ్చేందుకు టీఎస్‌ఎల్‌ఏ ఎంపిక చేసింది. 18 గ్రంథాలయాల నిర్వాహకులు తొలుత పుస్తకాలు తీసుకునేందుకు ముందుకొచ్చారు.

రెండు బాక్సుల చొప్పున..

ప్రతి గ్రంథాలయానికి రూ.6వేలు విలువైన పుస్తకాలను అందించనున్నారు. రెండు సెట్ల(బాక్సుల)లో ఉంటాయి. ఒక బాక్సులో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందించనుండగా.. మరో బాక్సులో ప్రముఖ రచయితలు రచించి విరాళంగా ఇచ్చిన పుస్తకాలు అందించనున్నారు. ఇదే కాకుండా టీఎస్‌ఎల్‌ఏ ఆధ్వర్యంలో గతంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నాలుగు గ్రంథాలయాలకు చేయూత అందించారు. లైబ్రేరియన్‌ పోస్టులకు సిద్ధమయ్యే వారికి ఉచితంగా శిక్షణ అందించారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగించి.. యువతకు తోడ్పాటు అందించనున్నట్లు సంఘం అధ్యక్షుడు ప్రొ.ఎన్‌.లక్ష్మణరావు ‘ఈనాడు’కు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని