logo

చిత్ర వార్తలు

కూరగాయల మండీ మొత్తాన్ని వాహనం పైనే తీసుకెళుతున్నట్లుంది కదూ ఈ చిత్రం. కూరగాయల మార్కెట్‌ నుంచి ద్విచక్ర వాహనంపై తన దుకాణానికి అన్ని రకాల కూరగాయలను బండికి వీలున్న చోటల్లా తగిలించుకొని తీసుకెళుతూ

Updated : 22 May 2022 05:29 IST

బండెక్కెనండీ.. కూరగాయల మండీ!

కూరగాయల మండీ మొత్తాన్ని వాహనం పైనే తీసుకెళుతున్నట్లుంది కదూ ఈ చిత్రం. కూరగాయల మార్కెట్‌ నుంచి ద్విచక్ర వాహనంపై తన దుకాణానికి అన్ని రకాల కూరగాయలను బండికి వీలున్న చోటల్లా తగిలించుకొని తీసుకెళుతూ ట్యాంక్‌బండ్‌పై ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది ఈ మహిళ.


స్పందించారు.. ముస్తాబు చేశారు

‘ముసుగు వీడుతోంది.. కళ తప్పుతోంది’ శీర్షికతో ఈనెల 18న ‘ఈనాడు’లో ప్రచురించిన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు. షేక్‌పేట నుంచి ఫిలింనగర్‌ ప్రధాన రహదారిపై డివైడర్లు మధ్యలో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులపై ఉన్న ముసుగులు తొలగించారు. బొమ్మల చేతుల్లో కత్తులు ఏర్పాటు చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు.


రాజీవ్‌కు కాంగ్రెస్‌ నేతల నివాళి

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్‌ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్‌కుమార్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌. పార్టీ సీనియర్‌ నేత, వి.హనుమంతరావు తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.


కాలుష్య కాసారం.. దొరికేనా ఆహారం

ఒకప్పుడు జీవనది అయిన మూసీ నేడు కాలకూట విషానికి నిలయమైంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలను తొలగించేందుకు రూ.కోట్లు కుమ్మరిస్తున్నా ప్రయోజనం అంతంతే. ప్లాస్టిక్‌ వ్యర్థాల మధ్య ఆహారం కోసం ఓ పక్షి తాపత్రయ పడుతున్న ఈ దృశ్యం చాదర్‌ఘాట్‌ వద్ద కెమెరాకు చిక్కింది.


వటపత్రశాయికి వరహాల లాలి

వివాహాలు, శుభకార్యాలకు అవసరమైన కొబ్బరి ఆకుల పందిళ్లు కావాలంటే.. చలో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం అనాల్సిందే. వీటి తయారీని ఇక్కడ పలువురు వృత్తిగా కొనసాగిస్తున్నారు. ఆ కుటుంబాలకు చెందిన ఓ చిన్నారి ఎండ వేడికి తట్టుకోలేక ఆకుల పందిరిపై సేద తీరుతూ కనిపించిందిలా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు