logo

ఉచిత నీటి పథకానికి ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు

గ్రేటర్‌లో అమలవుతున్న ఉచిత మంచి నీటి సరఫరా పథకానికి ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చునని జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. నమోదు చేసుకొన్న తర్వాతి నెల నుంచి పథకం కిందకి వస్తారన్నారు.

Published : 22 May 2022 04:30 IST

జలమండలి ఎండీ దానకిశోర్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో అమలవుతున్న ఉచిత మంచి నీటి సరఫరా పథకానికి ఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చునని జలమండలి ఎండీ దానకిశోర్‌ తెలిపారు. నమోదు చేసుకొన్న తర్వాతి నెల నుంచి పథకం కిందకి వస్తారన్నారు. శనివారం జలమండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంకా 4.2 లక్షల గృహ నల్లాదారులు ఉచిత పథకానికి ఆధార్‌ అనుసంధానం చేసుకోలేదన్నారు. ఇందులో 3 లక్షల వరకు ఫ్లాట్లు ఉంటాయని అంచనా అన్నారు. వీరందరికి ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆధార్‌ అనుసంధాన సమయంలో సమస్య ఉంటే 155313 నంబరుకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జలమండలి సెక్షన్ల వారీగా ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అజ్మీరాకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని