logo

పది పరీక్షలకు 1.65 లక్షల మంది

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న పరీక్షలకు మూడు జిల్లాల పరిధిలో 937 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Published : 22 May 2022 04:44 IST

మూడు జిల్లాల్లో సర్వం సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌

దో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్న పరీక్షలకు మూడు జిల్లాల పరిధిలో 937 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,65,902 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వరుసగా రెండేళ్ల విరామం తర్వాత పదో తరగతి పరీక్షలు జరగనుండటంతో అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాలలో శాశ్వత, అద్దె ప్రతిపాదికన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల బండిల్స్‌ తెరవడం మొదలుకుని జవాబుపత్రాల తరలింపు వరకు ప్రక్రియ నిఘా నీడలో కొనసాగనుంది.

పరిశుభ్రత బాధ్యత ఎవరిది?

ప్రభుత్వ పరీక్ష కేంద్రాలలో పరిశుభ్రత బాధ్యత విషయంలో అయోమయం నెలకొంది. గతంలో పాఠశాలల్లో ఉన్న కార్మికులను రాష్ట్ర విద్యాశాఖ తొలగించింది. అప్పట్నుంచి పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు నెల రోజులుగా మూసి ఉండటంతో శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతను నగరంలో జీహెచ్‌ఎంసీ, శివారుల్లో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలకు అప్పగించారు. మున్సిపల్‌ అధికారుల నుంచి సహకారం లేకపోవడంతో కొన్నిచోట్ల పాఠశాలలు శుభ్రపడలేదు.


ముందుగానే పరీక్ష కేంద్రాలు చూసుకోండి

- సుశీంద్రరావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా

విద్యార్థులు ఆదివారమే పరీక్ష కేంద్రాలను పరిశీలించుకోవాలి. ఇంటి నుంచి సెంటర్‌కు ఎంత సమయంలోగా చేరుకోవచ్చో అంచనా వేయాలి. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురాకూడదు. గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు గదిలోనే ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు