logo

పెట్రో మంట కాస్త తగ్గింది

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గడం నగరంలోని వాహనదారులకు పెద్ద ఊరట. లీటర్‌ పెట్రోలుపై దాదాపు రూ.పది తగ్గనుంది. శనివారం నగరంలో లీటర్‌ పెట్రోలు ధర రూ.119.49గా ఉంది. ఇది అటుఇటుగా రూ.110కి దిగి రానుంది.

Published : 22 May 2022 04:44 IST

నగరవాసులకు రోజుకు రూ.8 కోట్ల మేర ఊరట

ఈనాడు, హైదరాబాద్‌: పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గడం నగరంలోని వాహనదారులకు పెద్ద ఊరట. లీటర్‌ పెట్రోలుపై దాదాపు రూ.పది తగ్గనుంది. శనివారం నగరంలో లీటర్‌ పెట్రోలు ధర రూ.119.49గా ఉంది. ఇది అటుఇటుగా రూ.110కి దిగి రానుంది. డీజిల్‌ రూ.105.47 నుంచి రూ.వంద లోపునకు దిగనుంది. నగరంలో దాదాపు 72 లక్షల వాహనాలు ఉన్నాయి. సగానికి పైగా రోజూ రోడ్డుపైకి ఎక్కుతుంటాయి. పెట్రోల్‌ వాడకం నిత్యం 50 లక్షల లీటర్లు ఉంటే.. డీజిల్‌ వినియోగం 40 లక్షల లీటర్ల వరకు ఉంది. ఇంధన ధరల తగ్గింపుతో వాహనదారులపై రోజుకు రూ.8 కోట్ల వరకు భారం తగ్గనుంది. శనివారం అర్ధరాత్రి నుంచే ధరలు తగ్గనున్నాయని కేంద్రం ప్రకటన వెలువడిన వెంటనే పెట్రోలు బంకులు ఖాళీగా దర్శనమిచ్చాయి. చాలామంది ఆదివారం పెట్రోలు పోయించుకోవచ్చని వేచి చూశారు.

ఆమేరకు వస్తువుల ధరలు తగ్గాలి: వినియోగదారులు

నెల రోజుల క్రితం పెట్రోలు లీటర్‌ ధర రూ.109.08గా ఉంది. తర్వాత వరుసగా కొద్దిరోజుల పాటు పెరుగుతూ పోతూ మొత్తం మీద రూ.119.49కి చేరింది. ఏడాది క్రితం రూ.94.18 మాత్రమే. అప్పటి నుంచి ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రవాణా ఛార్జీలు పెంచడంతో నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. బస్సు, ఆటోలు, క్యాబ్‌ ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు రూ.పది తగ్గుతుండటంతో ఆ మేరకు వస్తువుల ధరలు తగ్గాలని నగరవాసులు కోరుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని