logo

అత్యాచార నిందితుడి పరారీ యత్నం.. తీవ్ర గాయాలు

అత్యాచార ఘటనలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే యత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి ఓ యువతి(19)పై అత్యాచారానికి పాల్పడిన నిర్మల్‌కు చెందిన కొత్వాల్‌ కృష్ణ అలియాస్‌

Updated : 22 May 2022 06:30 IST


కొత్వాల్‌ కృష్ణ

అమీర్‌పేట, న్యూస్‌టుడే: అత్యాచార ఘటనలో నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే యత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి ఓ యువతి(19)పై అత్యాచారానికి పాల్పడిన నిర్మల్‌కు చెందిన కొత్వాల్‌ కృష్ణ అలియాస్‌ సిద్ధార్థరెడ్డిపై మార్చి 26న ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. తనకు తాను సిద్ధార్థరెడ్డిగా చెప్పుకుని పలువురు యువతులను ఉద్యోగాలిప్పిస్తానని, సినిమాల్లో అవకాశాలిప్పిస్తానని మోసం చేసిన ఘటనల్లో కృష్ణ(40) నిందితుడు. నిర్మల్‌ ఠాణా పరిధిలో రౌడీషీట్‌ తెరిచారు. పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉన్న కృష్ణపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత కూడా మాదాపూర్‌ ఠాణా పరిధిలో మరో యువతిని మోసగించి, ఆమె ఆభరణాలు కాజేశాడు. ఎస్సార్‌నగర్‌ పోలీసులు శనివారం నిందితుడు కృష్ణను అమీర్‌పేటలో పట్టుకున్నారు. టాయిలెట్‌కు వెళ్తానని చెప్పిన కృష్ణ పారిపోయేందుకు ఎస్సార్‌నగర్‌ ఠాణా రెండో అంతస్తు వరండా నుంచి బయటవైపు గోడ పట్టుకుని కిందకు జారాడు. ఈ క్రమంలో గోడకు ఉన్న కరెంటు తీగల పైపునకు ఉన్న ఇనుప క్లాంప్‌ కాలికి తగిలి కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో కృష్ణ కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం నిందితుడిని ఆసుపత్రికి తరలించామని, పారిపోయేందుకు ప్రయత్నించడంతో మరో కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని