ఆకతాయిలూ.. ఆటలు చెల్లవిక!
కౌన్సెలింగ్ ఇస్తున్న సైకాలజిస్టులు
ఈనాడు, హైదరాబాద్: ఆకతాయిల వికృతచేష్టలకు కళ్లెం వేసేందుకు రాచకొండ పోలీసులు మరింతగా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో పోకిరీలు రెచ్చిపోతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 380 హాట్‌స్పాట్స్‌లో షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారు.
కొరియర్ బాయ్.. అసభ్య పదజాలం.. ఘటకేసర్‌కు చెందిన ఐటీ ఉద్యోగిని(37). పనిచేసే సంస్థ ఆమెకు యూఎస్బీ పరికరం కొరియర్ ద్వారా పంపింది. కొరియర్ బాయ్ కేశ శివగౌడ్(20) రాత్రి 8.45 గంటల సమయంలో పరికరం అందజేసేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. రాత్రివేళ కొరియర్ తీసుకునేందుకు సరైన సమయం కాదని తిరస్కరించారు. దీంతో కొరియర్ బాయ్ దూషించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటకేసర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
79 మంది పోకిరీలు.. రాచకొండ షీటీమ్స్ 8 వారాల వ్యవధిలో 79మంది పోకిరీలపై కేసులు నమోదు చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శనివారం ఎల్బీనగర్ రాచకొండ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో షీటీమ్స్ డీసీపీ షేక్ సలీమా, డాక్టర్ వాసవి భూమిక స్వచ్ఛంద సంస్థ సైకాలజిస్టులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
పుత్తడి బొమ్మలకు రక్షణ.. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లేక కొన్ని కుటుంబాలు ఆడపిల్లలకు యుక్తవయసు రాకముందే పెళ్లిళ్లు చేస్తున్నారు. బాల్యవివాహాలను కట్టడి చేసేందుకు భువనగిరి, యాదగిరిగుట్ట, మల్కాజిగిరి, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మహిళా స్వయంశక్తి సంఘాలకు అవగాహన కల్పించారు. 2 నెలల వ్యవధిలో 11 బాల్యవివాహాలను అడ్డుకున్నారు. ఈ మేరకు రాచకొండ షీ బృందాలు, డీసీపీ షేక్ సలీమాను సీపీ మహేష్ భగవత్ అభినందించారు. వేధింపులపై 94906 17111, డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ సలీమా సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కరాటే శిక్షణ ముసుగులో సంఘవిద్రోహ చర్యలు.. నిజామాబాద్‌లో ముగ్గురి అరెస్టు
-
India News
Bhagwant Mann: పంజాబ్ సీఎంకు కాబోయే భార్య గురించి తెలుసా?
-
Movies News
Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
-
Sports News
ధోనీ బర్త్‌డే స్పెషల్..41 అడుగుల కటౌట్
-
General News
Hyderabad: కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?