logo

30 రోజుల్లోనే కొడంగల్‌ ఎత్తిపోతల: రేవంత్‌రెడ్డి

‘మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. తరువాతి 30 రోజుల్లోనే నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పనులు మొదలు పెడతాం.

Published : 23 May 2022 01:20 IST

బొంరాస్‌పేటలో రైతు సమస్యలు వింటున్న రేవంత్‌రెడ్డి

బొంరాస్‌పేట, కొడంగల్‌, దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: ‘మరో 12 నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. తరువాతి 30 రోజుల్లోనే నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పనులు మొదలు పెడతాం. కొడంగల్‌ నియోజకవర్గానికి 1.07 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో తాను ఎమ్మెల్యేగా ఉన్పప్పుడే జీవో 69తో పథకం మంజూరు చేయించా. కృష్ణా జలాలతో కొడంగల్‌ ప్రాంతంలోని పెద్ద చెరువులకు నీళ్లు తీసుకు రావాలని చేపట్టిన పథకాన్ని ముఖ్యమంత్రి ఆపారని’ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ధ్వజమొత్తారు. ఆదివారం కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట మండలంలో తుంకిమెట్ల, కొడంగల్‌ మండలంలో అంగడిరైచూర్‌, దౌల్తాబాద్‌ మండలంలోని చంద్రకల్‌ గ్రామాల్లో జరిగిన ‘రైతు రచ్చబండ’లో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వరంగల్‌ డిక్లరేషన్‌ అంశాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. బొంరాస్‌పేటలో రైతు సమస్యలను ఆలకించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు తిరుపతిరెడ్డి, నర్సింహులుగౌడ్‌, యూసుఫ్‌, రాంచంద్రారెడ్డి, వెంకట్‌రావు, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని