logo

నీటి నాణ్యత వెంటనే తెలిసేలా..

కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిలో నిరంతరం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) సిద్ధమవుతోంది. నగరంలో నదిపై రెండు చోట్ల

Published : 23 May 2022 02:32 IST

మూసీపై రెండు కేంద్రాల ఏర్పాటుకు పీసీబీ సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: కాలుష్య కాసారంగా మారిన మూసీ నదిలో నిరంతరం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) సిద్ధమవుతోంది. నగరంలో నదిపై రెండు చోట్ల కొత్తగా రియల్‌ టైమ్‌ నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూసీ, ఈసీ నదులు కలిసే బాపూ ఘాట్‌ సంగమం, పీర్జాదిగూడ దగ్గర వీటిని ఏర్పాటు చేయనుంది. బాపూ ఘాట్‌ తర్వాతే ఎక్కువగా మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. అక్కడి నుంచి నాగోలు దాటే వరకూ భారీగా కాలుష్య కారకాలు చేరుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకు నే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షించి.. వ్యర్థాల కట్టడికి చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో దాని ఏర్పాటు వ్యయం సుమారు రూ.50 లక్షల లోపు ఉండొచ్చని అధికారులు తెలిపారు.

అధునాతన సౌకర్యాలు.. నీటి నాణ్యత పరీక్షించేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సుదీర్ఘంగా ఉండడంతో పరిష్కారంగా రియల్‌ టైమ్‌ నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలను తెచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తాయి. నీటి నాణ్యతను పరీక్షించి అప్పటికప్పుడు సమాచారాన్ని పీసీబీకి పంపుతుంది. నీటిలోని ఆక్సిజన్‌, అమ్మోనియా, బయో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌, కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌, నైట్రేట్‌, క్లోరైడ్‌, పీహెచ్‌, ఉష్ణోగ్రత సహా అన్ని వివరాల్ని ఎప్పటికప్పుడు లెక్కిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని