logo

కనిపించే దైవాలు వైద్యులు: మంత్రి సబితారెడ్డి

కనిపించని దేవుళ్లు ఉన్నారో లేరో తెలియదు కాని, కనిపించే ప్రత్యక్ష దైవాలు వైద్యులు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో కుటుంబ సభ్యులే

Published : 23 May 2022 02:32 IST

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో విద్యార్థుల సెల్ఫీ

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: కనిపించని దేవుళ్లు ఉన్నారో లేరో తెలియదు కాని, కనిపించే ప్రత్యక్ష దైవాలు వైద్యులు అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనా సమయంలో కుటుంబ సభ్యులే కరోనా సోకిన వారి వద్దకు వెళ్లేందుకు సాహసించని పరిస్థితుల్లో వైద్యులు తమ కుటుంబాలను వదిలి వచ్చి ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారని కొనియాడారు. యశోద గ్రూప్‌ ఆఫ్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో 10వ తరగతికి వెళ్తున్న విద్యార్థులకు వైద్య వృత్తిపై అవగాహన కల్పించేందుకు మూడు రోజులపాటు నిర్వహించిన 10వ వార్షిక యంగ్‌ డాక్టర్స్‌ క్యాంప్‌ ముగింపు కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబిత మాట్లాడుతూ.. నాడు బాలికలు చదువుకోవాలంటే సమాజం, కుటుంబం నుంచి అడ్డంకులుండేవని.. నేడు తల్లిదండ్రులతోపాటు సమాజంలోని వివిధ వర్గాల నుంచి ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్‌ ధీరజ్‌ గోరుకంటి, డాక్టర్‌ పవన్‌ గోరుకంటి, సికింద్రాబాద్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ లింగయ్యలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని