logo
Published : 23 May 2022 02:32 IST

రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రెండేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపి, తల్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన దొడ్డి లాస్య (23)కు ఔరవాణి గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి నరేశ్‌తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ప్రస్తుతం హైదరాబాద్‌ ఉంటూ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటుండగా, లాస్య ఔరవాణి గ్రామంలోనే అత్తమామలతో కలిసి ఉంటున్నారు. ఉన్నట్టుండి లాస్య ఆదివారం సాయంత్రం తన రెండేళ్ల వయసున్న కుమారుడు సాత్విక్‌(2)ను చీరతో గొంతు నులిమి చంపారు. అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అత్తామామలు వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి తల్లి, కుమారుడు చనిపోయి ఉన్నారు. వారం క్రితమే కుమారుడు సాత్విక్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని