logo
Published : 23 May 2022 02:32 IST

చిన్నారిని చిదిమేసిన సవతి తల్లి

భవనం పైనుంచి తోసినా బతికాడని గొంతు నులిమిన వైనం

కాచిగూడ, న్యూస్‌టుడే: అభం శుభం తెలియని చిన్నారిని కాపాడాల్సిన సవతి తల్లి కర్కశంగా వ్యవహరించింది. వేధిస్తుంటే తండ్రికి ఫిర్యాదు చేస్తున్నాడని భవనం పైనుంచి తోసింది. బతికి బయటపడ్డాడని గొంతు నులిమి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. సీఐ హబీబుల్లాఖాన్‌ వివరాల ప్రకారం... నాగర్‌ కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లికి చెందిన భాస్కర్‌ భార్య రత్నమాల ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటికే వారికి ఏడాది వయసున్న ఉజ్వల్‌ కుమారుడు ఉన్నాడు. భాస్కర్‌ సరిత(31)ను రెండో వివాహం చేసుకున్నాడు. భార్య, కుమారుడు సహా రెండేళ్ల కిందట నగరానికి వచ్చాడు. గోల్నాకలో అద్దె ఇంట్లో ఉంటూ.. మేస్త్రీ పని చేస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ఆర్నెల్ల పాప ఉంది. ఉజ్వల్‌(7) ఒకటో తరగతి చదువుతున్నాడు. వారుంటున్న భవనం మొదటి అంతస్తు నుంచి 15 రోజుల క్రితం ఉజ్వల్‌ పడిపోయాడు. ఇంటి యజమాని గమనించి ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. కోలుకుని ఇంటికి వచ్చిన బాలుడు శనివారం సాయంత్రం విగతజీవిగా కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సవతి తల్లిని అనుమానించి విచారించగా ఉజ్వల్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు చెప్పింది. భవనంపై నుంచి తోసినా బతకడంతో గొంతు నులిమానని అంగీకరించింది. ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని