logo

చిత్రవార్తలు

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో అభ్యర్థులు సాధనపై మరింత దృష్టి పెడుతున్నారు. అశోక్‌నగర్‌ కేంద్ర గంథ్రాలయం వద్ద రాత్రుళ్లు సాధన చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ లైబ్రరీ

Updated : 23 May 2022 05:29 IST

పగలూ.. రాత్రీ ఒకటే ధ్యాస.. కొలువే శ్వాస

ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతుండడంతో అభ్యర్థులు సాధనపై మరింత దృష్టి పెడుతున్నారు. అశోక్‌నగర్‌ కేంద్ర గంథ్రాలయం వద్ద రాత్రుళ్లు సాధన చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ లైబ్రరీ సాయంత్రం 4.30కే మూసేయగా చెట్ల కింద చదువుకున్నారు.


ఆదివారం.. సపరివారం

కరోనా భయం దాదాపుగా వీడిపోవడంతో వారాంతాలు పర్యాటక ప్రాంతాలు పాత రోజులను తలపిస్తున్నాయి. లుంబినీ పార్కు సహా పరిసర ప్రాంతాలు ఆదివారం కిటకిటలాడాయి. లుంబినీ పార్కులోని ఫౌంటెయిన్‌ వద్ద నీళ్లలో చిన్నారులు సందడి చేశారు.


పదిలమైన ఏర్పాట్లు

నగరవ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పదిలమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఆదివారం విద్యాశాఖాధికారులు పరిశీలించారు. విజయ్‌నగర్‌ కాలనీ స్కూలులో హాల్‌టిక్కెట్ల నంబర్లతో కూడిన బోర్డును అమరుస్తున్న సిబ్బంది.





 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని