logo

పది పరీక్షలకు 226 మంది గైర్హాజరు

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు  కావడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 14,440 మంది విద్యార్థులు హాజరు కావాల్సి

Published : 24 May 2022 00:46 IST

వికారాబాద్‌లోని పరీక్ష కేంద్రం వద్ద...

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు  కావడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 14,440 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 14,214 మంది వచ్చారు. 226 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ జిల్లా పరిశీలకురాలు విజయలక్ష్మీబాయి సందర్శించారు. ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు ఏడు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, నలుగు హాజరయ్యారు.

వికారాబాద్‌లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

వికారాబాద్‌ మున్సిపాలిటీ: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు స్థానిక బస్‌స్టాండ్‌లో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్‌ బి. మహేశ్‌కుమార్‌ తెలిపారు. ఇదే కాకుండా పట్టణంలోని ఎమ్మార్పీ, ఎన్టీఆర్‌ చౌరస్తాలు, తాండూర్‌ వైపు, పరిగి, హైదరాబాద్‌ వైపు వెళ్లే రూట్‌లో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులకు కావాల్సిన సమాచారాన్ని ఇక్కడ నియమించిన సిబ్బంది తెలుపుతారన్నారు.

బొంరాస్‌పేట: రేగడిమైలారం పాఠశాల విద్యార్థి సాయిలేశ్‌ ద్విచక్ర వాహనంపై బొంరాస్‌పేటకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైంది. ప్రాథమిక చికిత్స చేయించుకొని కానిస్టేబుల్‌ సాయంతో పరీక్షకు హాజరయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని